MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని షాన్భాగ్ ఫంక్షన్ హాల్లో కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవ నిర్వహణ సన్నాహక విస్తృత సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఖాదర్ , గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్ , కిన్నెరసాని కాలేజీ ప్రిన్సిపాల్ గోగ్గేలా రమేష్ , కృష్ణ సాగర్ ప్రిన్సిపాల్ దేవదాస్ లు పాల్గొన్నారు . మూడు నెలల్లో జరగనున్న స్వర్ణోత్సవ వేడుకను విజయవంతంగా నిర్వహించేందుకు 15 ప్రత్యేక కమిటీలు చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ – 1975లో ప్రారంభమైన కిన్నెరసాని గురుకుల పాఠశాల నుండి వేలాది మంది ప్రతిభావంతులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తుచేశారు. కన్నతల్లి లాంటి ఈ పాఠశాల అభివృద్ధికి అందరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కమిటిల పేర్లను త్వరలోనే తెలియజేస్తామన్నారు . ఇప్పటి వరకు 800 మంది పూర్వ విద్యార్థులు గూగుల్ షీట్ ద్వారా నమోదు చేసుకున్నారని, ఇంకా నమోదు కానీ పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. సమావేశంలో గతంలో సేవలందించి మృతిచెందిన ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల స్మరణార్థం ఒక నిమిషం మౌనం పాటించారు. అలాగే స్వర్ణోత్సవ వేడుక విజయవంతం కావాలన్నదే అందరి అభిలాష అని, ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలతో ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. సమావేశానికి వేదికను ఏర్పాటు చేసి, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఖాదర్ కి కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసారు ఈ సన్నాహక సమావేశంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily