AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ అక్టోబర్ 25 అక్షరం న్యూస్ పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు లో గల పెద్దమ్మనగర్ ప్రజలు అంత్యక్రియలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వార్డు ప్రజల అవసరాల దృష్ట్యా శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని 17వ వార్డు కౌన్సిలర్ తోట ఫణీందర్ కోరారు. ఈ మేరకు 17వ వార్డులోని సర్వే నంబర్లు 52, 53లో ఉన్న టీఎస్ జెన్కోకు చెందిన 12 గుంటల భూమిని శ్మశాన వాటిక ఏర్పాటుకు కేటాయించాలని కోరుతూ పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్‌కు, మున్సిపల్ చైర్మన్ ద్వారా వినతిపత్రం అందజేశారు. సదరు భూమి చాలా కాలంగా ఖాళీగా ఉందని, ఎలాంటి వినియోగంలో లేదని, శ్మశాన వాటిక ఏర్పాటుకు అనుకూలంగా ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీఎస్ జెన్కో నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సదరు భూమిని శ్మశాన వాటిక లేదా స్మశాన వనంగా అభివృద్ధి చేసి, 17వ వార్డు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టి వీలైనంత త్వరగా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ ఫణీందర్ కోరారు. ఈ వినతిపత్రం ప్రతులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్, టీఎస్ జెన్కో సీఎండీ, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్‌కు కూడా పంపించడం జరిగిందని కౌన్సిలర్ ఫణిందర్ తెలిపారు
.
Aksharam Telugu Daily