AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 16/ అక్షరం న్యూస్/ --- భారతరత్న అవార్డు గ్రహీత దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి వర్ధంతి వేడుకలను 70 వ బూత్ గణేష్ నగర్ నందు బిజెపి సీనియర్ నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు అటల్ బిహారీ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సీనియర్ నాయకులు ముత్తవరపు రత్తయ్య మాట్లాడుతూ వాజ్ పేయి మంచి వక్త మంచి కవి మేధో సంపన్నుడు రాజనీతి లో అపర చాణిక్యుడు అని అన్నారు. ప్రధానిగా దేశానికి సమర్థవంతమైన న్యాయకత్వం అందించిన ధీశాలి. ప్రతిపక్షంలో కూర్చుంటాం కానీ అధికారం కోసం దిగజారమని ఒక ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయి తిరిగి ప్రజా తీర్పు కొరికి ఆదర్శ నాయకుడని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా నేటి రాజకీయ నాయకులు వాజ్ పేయి నీ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. ప్రపంచ దేశాల ఆంక్షల బెదిరింపులు లెక్కచేయకుండా ప్రోక్రాన్ అణు పరీక్షలను నిర్వహించిన ధైర్యవంతుడు అని అన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశం నలుమూలల స్వర్ణ చతుర్భుజ్ జాతీయ రహదారుల రూపకర్త వాజ్ పేయి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా దేశంలోని అన్ని గ్రామాలకు రహదారులు నిర్మించి పట్టణాలకు అనుసంధానం చేసిన మహనీయుడు వాజ్ పేయి అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా ఓ బి సి జిల్లా అధ్యక్షులు బిట్రగుంట క్రాంతి కుమార్ సీనియర్ నాయకులు సాధం లోకనాథం పగడాల శ్రీధర్ రావు మాజీ ప్రధాన కార్యదర్శిలు పొగాకు పూర్ణచంద్ పాలెం సమ్మయ్య చిడెం గోపి ఓబీసీ జిల్లా కార్యదర్శి వేణు కుమార్ ఓ బి సి మండల అధ్యక్షుడు కొండేటి చంద్రశేఖర్ శేఖర్ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily