Monday, 15 December 2025 07:09:01 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

నాణ్యమైన వైద్యం, విద్య లక్ష్యం.. ... వాటి ప్రమాణాల మెరుగు కోసం ప్రత్యేక చర్యలు .... ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ

పరుగెడుతూ.. పరిగెత్తిస్తూ.. ప్రగతి పథములో సాగుతూ.. ... ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ముందుకు.. .... "అక్షరం ప్రతినిధి"తో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ... ఏడాది పదవీకాలంలో జిల్లా పాలనపై తనదైన ముద్ర వేసుకున్న కలెక్టర్


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 23 September 2025 07:39 PM Views : 1294

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ..... దొమ్మటి రాజేష్, అక్షరం ప్రతినిధి, పెద్దపల్లి; సమాజంలో అందరికీ అవసరమైన విద్య, వైద్యం ను నాణ్యమైన ప్రమాణాలతో అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో వైద్యం, విద్యను సామాన్యులకు అందించేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్య వైద్యము ద్వారానే మెరుగైన సమాజం ఏర్పాటు సాధ్యమవుతుందని అందుకే తాను ఈ రెండు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న కోయ శ్రీ హర్ష ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేస్తూ, వన్ మ్యాన్ ఆర్మీలా ప్రజాసేవకు అంకిత మయ్యారు. రాజకీయ ఒత్తిళ్లు, ఉన్నత అధికారుల ప్రెషర్స్ తట్టుకొని జిల్లా పాలనపై తనదైన ముద్ర వేసుకున్నారు. మొదట ఉద్యోగుల మీద సస్పెన్షన్ వేటు వేస్తూ హడలెత్తించిన కలెక్టర్... ఆ తర్వాత అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టి, వేగవంతంగా పనులు జరిగేలా జిల్లా పాలనపై పట్టు సాధించారు. తాను పరిగెడుతూ.. తన కిందిస్థాయి అధికారులను పరిగెత్తిస్తూ.. అభివృద్ధిలో, సంక్షేమంలో జిల్లాను ముందు వరసలో నిలబెట్టేందుకు నిత్యం జిల్లాలో పర్యటనలు చేస్తూ, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, ప్రజా సమస్యలకు కూడా పరిష్కరించేందుకు సమయం కేటాయిస్తూ.. అలుపెరుగని విధంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం "అక్షరం ప్రతినిధి"కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యం పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరిచి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నాం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన పరికరాలు ఏర్పాటుచేసి అరుదైన శస్త్ర చికిత్సలతో పాటు కంటి, దంత వైద్య శస్త్ర చికిత్సలు అందిస్తున్నాం. ప్రస్తుతం ఆరోగ్య కేంద్రాలలో ఓపి పెరగడంతో పాటు ఇన్ పేషంట్ల సంఖ్య, డెలివరీల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం కలిగే విధంగా వైద్య సేవలు అందిస్తున్నాం. అన్ని రకాల వైద్య నిపుణులు ఉండటం వల్ల చాలా రకాల ఆపరేషన్లు చేపడుతున్నారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం అవసరమైన చోట వైద్యులు ఇతర సిబ్బంది నియమించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు వైద్య రంగంలో మార్పులు వెంటనే చూడగలుగుతున్నాం. విద్య రంగంలో పెనుమార్పులను త్వరలో చూడబోతున్నాం. విద్య ప్రమాణాల మెరుగు కోసం నిత్యం పర్యవేక్షించడంతో పాటు ఉపాధ్యాయులతో ప్రతి వారం కాపీ విత్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. అవసరమైన చోట ఇప్పటికీ 20 మంది వాలంటీర్లను నియమించుకునే అవకాశం కల్పించాం. 60కోట్ల రూపాయలతో పాఠశాలలో మౌలిక వసతులతో పాటు ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడుతున్నాం. కార్పొరేట్ స్థాయిలో సామాన్యులకు విద్యా అందించే ప్రయత్నం జరుగుతుంది. త్వరలోనే విద్యారంగంలో మెరుగైన ఫలితాలను మనం చూస్తాం. భూభారత్ తో రైతుల సమస్యలకు పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందించిన భూభారతి ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం భూభారతిలో 15950 దరఖాస్తులు రాగా, 7600 దరఖాస్తులు పరిష్కరించే విధంగా ఉన్నాయని, ఇప్పటివరకు 2700 సమస్యలు పరిష్కరించినట్టు తెలిపారు. గ్రామ పరిపాలన అధికారి వ్యవస్థ రావడంతో సమస్యలను మరింత తొందరగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దశలవారీగా భూభారతిలో రైతుల భూమి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాం. ఎన్ టి పి సి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో ఉన్న ఎన్టిపిసి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి ఏటా ఐదు నుండి ఆరు కోట్లు మాత్రమే ఇస్తుండగా, ఏడాది 16 కోట్ల ఇవ్వడానికి ఎన్టిపిసి ముందుకు రావడం అభినందనీయం. ఆ సంస్థ ఇచ్చే నిధులతో రామగుండం కార్పొరేషన్ లో పరిధిలో, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల పరిష్కారంతో పాటు సౌకర్యాల కల్పనకు ఖర్చు చేయడానికి ప్రాణాలిక రూపొందించాం. ఈసారి ఎక్కువగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఖర్చు చేయాలని నిర్ణయించాం. ఎన్టిపిసి, సింగరేణి, ఆర్ ఎఫ్ సి ఎల్ సహకారంతో జిల్లాలో పాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ntpc సహకారంతో ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టగా గత ఎడాది కలెక్టరేట్లో సోలార్ ప్లాట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం పెద్దపల్లి జిల్లా వ్యవసాయ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి తగిన ప్రోత్సాహం కల్పిస్తున్నాం ఆధునాతన పద్ధతిలో వ్యవసాయం చేసే విధంగా రైతులను చైతన్యం చేసే కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. ఆయిల్ ఫామ్ లో ప్రత్యామ్నాయ కోకో పంట సాగును ప్రోత్సహిస్తున్నాం. ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు సమయంలో ఏలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకొని, 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసాం. ఇటీవల యూరియా కొరత సమస్య తలెత్తిన సందర్భంగా రైతులకు సమస్యలు లేకుండా పకడ్బంది చర్యలు చేపట్టాం. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు విధుల పట్ల అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పనిచేసే అధికారులకు మంచి ప్రోత్సహం అందిస్తాం. ఎవరి పని వారు చేసుకోవాలి. ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన నాకు ఉండదు. శాఖ పనులతో పాటు ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు దృష్టి సారించాలి. ఉద్యోగం పరంగా అలసత్వంగా వ్యవహరించినా, అవినీతి, అక్రమాలకు పాల్పడిన కఠినంగా వ్యవహరించక తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసి పెట్టాం. ప్రస్తుతం రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల నిర్వహణకు అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాం.. ఇక తనపై వచ్చే ఆరోపణలు, విమర్శలకు తాను స్పందించబోనని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. అలిగేషన్ వస్తుంటాయి, పోతుంటాయి.. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ సేవలు రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఎంతో అవసరమని అందుకే ఆమెకు కార్పొరేషన్ కమిషనర్ గా పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించి వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఒక సీనియర్ అధికారి కమిషనర్ గా ఉండడం వల్ల రామగుండంలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి కావడంతో పాటు సమస్యల పరిష్కారానికి అవకాశం దొరికిందని తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :