D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి 5 వైరా (అక్షరం న్యూస్) సంక్రాంతి సంబరాలలో భాగంగా ధనుర్మాసంలో ఈరోజు మంచి రోజు సందర్భంగా వాణి వివేకనంద విద్యాలయంలో బొమ్మల కొలువును ఘనంగా ఏర్పాటు చేశారు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అనేక రకాల బొమ్మలను తీసుకొని వచ్చి టీచర్స్ సహకారంతో సరస్వతి అమ్మవారి దగ్గర అద్భుతమైన రీతిలో బొమ్మలను పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, కోటేశ్వరరావు ప్రిన్సిపాల్ వాణి మాట్లాడుతూ. సంక్రాంతి పండగ విశిష్టతను తెలుపుతూ విద్యార్థులలో భక్తి భావాన్ని పెంపొందిస్తూ ఈ యొక్క బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం జరిగిందని సరస్వతి అమ్మవారి ఆశీర్వాదాలతో విద్యార్థులందరికీ చదువుపై ఏకాగ్రత కలిగి ఉండాలని ఈ నూతన సంవత్సరంలో మా విద్యార్థులందరికీ మంచి జరగాలని వారు తెలియజేశారు అనంతరం విద్యార్థులందరినీ పూలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కన్వీనర్ గింజుపల్లి జనార్ధన్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily