Tuesday, 10 February 2026 08:27:28 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పలు రైళ్ల హాల్టింగ్ పునరుద్ధరణ చేయాలని రైల్వే శాఖ సహాయ మంత్రి ని కలిసిన ఎంపీ


CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABD

Reporter

Date : 08 August 2025 10:51 AM Views : 488

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : . మహబూబాబాద్ /కేసముద్రం /ఆగస్టు 7/అక్షరం న్యూస్ :- కేసముద్రం మండలం పలు రైళ్ల హల్టింగ్ మరియు గతంలో హాల్టింగ్ ఉన్న రైళ్లను పునరుద్ధరణ చేయాలని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రణ్వీత్ సింగ్ ని కలిసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్. గురువారం ఢిల్లీలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు,వారు ఎంపీ బలరాం నాయక్ ని కలిసి కేసముద్రం మండలం పలు రైళ్ల హల్టింగ్ మరియు గతంలో హాల్టింగ్ ఉన్న రైళ్లను పునరుద్ధరణ విషయం గురించి చర్చించారు. అనంతరం ఎంపీ బలరాం నాయక్ తో నాగేశ్వరావు కలిసి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రణ్వీత్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.గతంలో కేసముద్రం రైల్వేస్టేషన్లో హాల్టింగ్ కలిగి ఉండే బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్,పద్మావతి ఎక్స్ప్రెస్ (అప్),కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్,సాయినగర్ షిర్డీ అప్,సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్పెస్,మణుగూరు ఎక్స్పెస్, మచిలీపట్నం ఎక్స్పెస్ లను పునరుద్ధరించాలని కోరారు.అదే విధంగా ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగునంగా నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్,ఇంటర్సీటీ ఎక్స్ ప్రెస్ ఈ రెండు రైళ్లు కేసముద్రంలో హాల్టింగ్ ఇప్పిస్తే హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణీలకు సౌకర్యంగా ఉంటుంది అని అన్నారు.రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరణ చేయాలని రైల్వే శాఖ సహాయ మంత్రినీ కోరారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :