Sunday, 07 June 2026 05:14:41 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఒకే కాన్పులో ముగ్గురు జననం. ముస్తాబాద్ మండల కేంద్రం లోని శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో అరుదైన ఘటన

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 13 April 2025 02:55 PM Views : 2078

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/ఏప్రిల్-13(అక్షరం న్యూస్) ఆదివారం పూట ఆ ఇంట సిరులు కురిశాయి. అయితే అది ధన రూపంలో కాదు.. సంతానం రూపంలో.. అవును! సంతానం కూడా సంపదేనని మన పూర్వికులు ఏనాడో అన్నారు. తాజాగా ఓ మహిళ కాన్పు కోసం దవాఖానాకు వెళ్తే.. ఏకంగా ముగ్గురు శిశువు లకు ( ట్రిప్లెట్స్‌) జన్మనిచ్చింది. ఒకేసారి తమ ఇంట సంతాన లక్ష్మి వరాలు కురిపించడంతో ఆ తల్లీదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఈ సంఘటన ముస్తాబాద్ మండల కేంద్రం లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే. .ముస్తాబాద్ మండలం చిప్పల పల్లి గ్రామానికి చెందిన పోడెండ్ల సృజన మహేష్ దంపతులకు మొదటి కాన్పులో పాప జన్మించింది తరువాత.కాలక్రమంలో సృజన మళ్ళీ ప్రెగ్నెన్సీ కావడంతో ముస్తాబాద్ మండల కేంద్రం లోని గత 37 సంవత్సరాలుగా డా॥ ఎరవెల్లి చంద్రశేఖర్ రావు - డా॥ఎరవెల్లి అనురాధ ల ఆధ్వర్యంలో ఎన్నో వైద్య సేవలు అందిస్తున్న శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో రెగ్యులర్ చెకప్ చేయించుకునేది. డెలివరీ సమయం కావడం తో పరీక్షలు చేసిన వైద్యులు సాధారణ కాన్పు సాధ్యం కాకపోవడం తోశస్త్రచికిత్స చేసి ప్రసవం చేయగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు లో ఒక బాబు, ఇద్దరు పాపలు పుట్టడం విశేషం.ఈ సందర్బంగా హాస్పిటల్ లో ఒకే కాన్పులో ముగ్గురు శిశివులు జన్మించడం.. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటం సంతోషకరమన్నారు. కాన్పుకు సంబంధించి శస్త్ర చికిత్సలో ప్రసవం చేసిన డా॥ టి. స్రవంతి - డా॥ శ్రీకాంత్ లను పిల్లల తల్లిదండ్రులు,బంధువులు డాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. పుట్టిన ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబంతా సంతోషంలో మునిగిపోయారు..ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ ఇలాంటి ప్రసవాలు అరుదుగా జరుగుతుంటా యని తెలిపారు శిశువు ల్లో ఒకరు 1.4 మరొకరు1.4 ఇంకొకరు1.4 కిలోలు ఉన్నారని ఆరోగ్యం గా ఉన్నారని మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి అన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :