DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జనవరి 11 అక్షరం న్యూస్ రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో బిజెపి అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు బిజెపి మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, పెద్దపల్లి పట్టణానికి చెందిన 17 వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి జెట్టి రాజు ఇతర బీజేపీ నాయకులు ఆదివారం రోజున హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్బంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు చేసిందేమి లేదని. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ. ప్రజలను మోసం చేయడంలో పార్టీల నాయకులు అబద్ధపు ప్రచారాలతో మున్సిపల్ ఎలక్షన్లో ఓటు కోసం ప్రజల వద్దకు వస్తారని అన్నారు. మున్సిపల్ ఎలక్షన్లలో బిజెపి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు అనంతరం పెద్దపల్లి పట్టణ 17వ వార్డు బీజేపీ అభ్యర్థి జెట్టి రాజును ఎంపీ ఈటెల రాజేందర్ శాలువాతో సత్కరించి బిజెపి జెండా ఎగరవేయాలని ఆకాంక్షించారు. జెట్టి రాజు స్పందిస్తూ తమ 17వ వార్డులో బీజేపీ గెలుపే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఈటెల రాజేందర్ తో ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కలవేణి స్వామితో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily