Friday, 20 November 2026 01:47:53 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

భారతదేశం గర్వించదగ్గ నాయకురాలు ఇందిరాగాంధీ ఘన నివాళులు తెలిపిన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భూతగడ్డ సంపత్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 19 November 2026 02:29 PM Views : 66

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 19 అక్షరం న్యూస్ భారతదేశ మాజీ తొలి మహిళా ప్రధానమంత్రి ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో పట్టణ అధ్యక్షులు భూతగడ్డ సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సంపత్ మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల అభ్యున్నతి కోసం పోరాడుతూ, పేదరిక నిర్మూలన లక్ష్యంగా గరీబీ హటావో నినాదంతో ముందుకు సాగారన్నారు అంతేకాకుండా అనేకమైన మహోన్నత పదవులు పొంది దేశ ప్రజలందరికీ అద్భుతమైన సంక్షేమ పథకాల అందించి దేశ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు స్వర్గీయ ఇందిరా గాంధీ సేవలకు గుర్తుగా భారతరత్న అవార్డు తన సొంతం చేసుకున్నారన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం ఇందిరమ్మ ఆశయాలను ముందుకు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి పాక్స్ చైర్మన్ ముత్యాల నరేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మాహిళలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :