Saturday, 03 October 2026 04:12:37 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పోత్కపల్లి రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కి స్థల పరిశీలన అభివృద్ధికి మరో అడుగు.. పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 02 October 2026 04:08 PM Views : 421

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి /,ఓదెల అక్టోబర్ 02 (అక్షరం న్యూస్) పోత్కపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయడం వల్ల ప్రయాణికుల ఇబ్బందులను తొలగించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో పర్యటించి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించడం కోసం గ్రామస్తులు నాయకులతో చర్చించారు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నుండి మార్కెటు స్థలం ఆనుకొని గుంపుల రోడ్డు వరకు లింకు రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటుందని గ్రామస్తుల అభిప్రాయం మేరకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు ఈ విషయంపై పలువురు అధికారులతో మాట్లాడి జమ్మికుంట రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం ఎలా జరిగిందో దాని ప్రకారం సుల్తానాబాద్ జమ్మికుంట ఓదెల కాల్వ శ్రీరాంపూర్ రూప్ నారాయణపేట గుంపుల గ్రామాలకు వెళ్లేందుకు సౌకర్యంగా లింకు రోడ్డు కలుపుకొని ఫ్లై ఓవర్ నిర్మాణం చేయాలని ఆదేశించారు అదేవిధంగా పోత్కపల్లి గ్రామం నుండి రూపు నారాయణపేట మరియు కాల్వ శ్రీరాంపూర్ లకు నూతనంగా నిర్మిస్తున్న రహదారులను పరిశీలించారు రూపు నారాయణపేట వెళ్లే రహదారిలో బావులు ప్రమాదకరంగా ఉన్నాయని రైతులతో చర్చించి వారికి ప్రత్యన్య మార్గాన్ని తప్పకుండా సమకూర్స్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైల్వే క్రాసింగ్ వద్ద ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై పలు తెలియజేశామని రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. పోత్కపల్లి ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులతో సమన్వయం చేస్తామని పేర్కొన్నారు. స్థల పరిశీలన సందర్భంగా అధికారులు, స్థానిక తహసిల్దార్ బి వనజా నాయక్ వివిధ గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :