AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/ఆగస్టు 28/అక్షరం న్యూస్ : రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆగస్టు 29న(శనివారం రోజున ) కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని అన్నారు. విద్యార్థుల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో బీజేపీ జిల్లా పదాధికారులు, రాష్ట్ర నాయకులు, మండల, పట్టణ, జోన్ ల అధ్యక్షులు, మండల నాయకులు, వివిధ మోర్చాల జిల్లా, రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, మండల ఇన్చార్జిలు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిరసన వివరాలు : స్థలం : కరీంనగర్ తెలంగాణ చౌరస్తా (గీతా భవన్ ఎదురుగా) తేదీ : 29-08-2026, శనివారం సమయం : ఉదయం 10 గంటలకు ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆకుల రాజేందర్ హెచ్చరించారు.
.
Aksharam Telugu Daily