AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగస్టు 15 అక్షరం న్యూస్ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలు చిరస్మరణీయమని, వారు చూపిన త్యాగనిరతిని దేశం ఎప్పటికీ మరువదని పెద్దపల్లి బీఆర్ఎస్ నాయకురాలు, జిల్లా బీసీ జేఏసీ చైర్‌పర్సన్ దాసరి ఉష పేర్కొన్నారు. శనివారం దేశం ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ,మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సైనిక అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన ప్రత్యేక నివాళి కార్యక్రమం అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భోపాల్‌లోని ప్రసిద్ధ ఎస్‌ఎస్‌బి అకాడమీ ప్రాంగణంలో ఉన్న వీర జవాన్ల స్మారక చిహ్నం వద్ద జిల్లా బీసీ జేఏసీ చైర్‌పర్సన్ దాసరి ఉష ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విశ్రాంత సైనికాధికారులు పాల్గొని వీరుల స్మృతికి ఘన నివాళులు అర్పించారు
.
Aksharam Telugu Daily