AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రంగారెడ్డి : అక్షరం /న్యూస్. రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా మోకిల పరిధిలోని మీర్జాగూడ గేట్ వద్ద గురువారం (జనవరి 8) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. శంకర్‌పల్లి మండలం దొంతానపల్లిలోని ICFAI (IBS) కళాశాలలో బీబీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. మృతులను సూర్యతేజ (20), సుమిత్ (20), శ్రీనిఖిల్ (20), రోహిత్ (18)గా గుర్తించారు.
.
Aksharam Telugu Daily