AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 9/ అక్షరం న్యూస్ -----బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BSFI) నియోజకవర్గ స్థాయి సమావేశం ఆగస్టు 2 శనివారం నాడు భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నందు నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దాసరి శేఖర్ బి ఎస్ ఎప్ ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షులు అజయ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి దాసరి శేఖర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు అధ్యక్షులను నియమించడం జరిగింది. అందులో భాగంగానే చర్ల మండల చర్ల మండల బి ఎస్ఎఫ్ఐ (BSFI ) అధ్యక్షులుగా కొట్టే నవీన్ కి నియామక పత్రం అందించి నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కొట్టే నవీన్ మాట్లాడుతూ ప్రభుత్వాలు బహుజన పేద విద్యార్థులకు చట్టపరంగా అందించవలసిన మెరుగైన విద్యను విద్యాసంస్థల్లో కల్పించవలసిన మెరుగైన వసతులను అందించడంలో పూర్తిగా విఫలం అవుతున్నాయని కుట్రపూరితంగానే ఈ విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నారని అన్నారు. చట్టపరంగా విద్యారంగానికి కేటాయించవలసిన నిధులు కేటాయించక పోవడంతో వల్లనే ప్రభుత్వ విద్యా రంగం ఈ విధంగా నాశనం అవుతుందని విమర్శించారు. బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కచ్చితంగా ప్రభుత్వ విద్య రంగ రక్షణకై పోరాడుతుందని ప్రభుత్వ విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కై ఉద్యమిస్తుందని అన్నారు. మహనీయుల వల్లనే ఈరోజు బహుజన జాతులకు విద్య అందు తుందని అన్నారు. మహనీయులు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చత్రపతి సాహు మహారాజ్ నారాయణ గురు పెరియార్ రామస్వామి బిర్సా ముండా డా బి ఆర్ అంబేద్కర్ ఉద్ధం సింగ్ మాన్యశ్రీ కాన్సిరాం ఆశయ సాధన కోసం ప్రతి బహుజన బిడ్డకు భారత రాజ్యాంగ ప్రకారం నాణ్యమైన విద్యని అందించే దానికోసం బి ఎస్ఎఫ్ఐ గా మేము కృషి చేస్తామని తెలిపారు. మమ్మల్ని నమ్మి పై నాయకత్వం మాకు ఈ బాధ్యతలను ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పై నాయకత్వం మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయమని బహుజన వాదాన్ని విద్యార్థుల్లోకి మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. చర్ల మండలంలో అనేక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారని తక్షణమే ఎన్నికల్లో విద్యారంగానికి స్థానిక విద్యార్థులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చర్ల మండల కేంద్రంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని ఏకలవ్య పాఠశాలను చర్ల మండల కేంద్రంలో నిర్మించి ఉన్న భవనంలో నడిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్ధిని విద్యార్థులు ఉపాధ్యాయులు అంబేద్కర్ రైట్స్ ప్రజాస్వామిక వాదులు పాత్రికేయ మిత్రులు మేధావులు యువకులు బిఎస్ఎఫ్ఐ ని ఆదరించాలని బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
.
Aksharam Telugu Daily