D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మే13 (అక్షరం న్యూస్ ) తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాల మేరకు గంగారం మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి మరియు విద్యా ప్రమాణాల మెరుగుదలపై బుధవారం గిరిజన బాలికల ఆ(శమ ఉన్నత పాఠశాల గంగారంలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి గంగారం మండలంలోని పలువురు సర్పంచులు, ఉపాధ్యాయులు మరియు మండల అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా కామారం గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి ఈక. పార్వతమ్మ గారిని మండల విద్యాశాఖాధికారి శ్రీమతి ఎ. రమాదేవి గారు, మండల రెవెన్యూ అధికారి బి. బాలకిషన్ మరియు ఇతర మండల అధికారులు ఘనంగా సన్మానించార ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి విద్యే పునాది అని, ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడంలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ విద్యా విస్తరణ, విద్యార్థుల హాజరు మరియు విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేకంగా చర్చించినట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, ప్రజాప్రతినిధులు మరియు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily