AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 10/ అక్షరం న్యూస్/--- హీరో మహేష్ బాబు( ఆగస్టు 9) న జన్మదినాన్ని పురస్కరించుకొని మహేష్ బాబు వీరాభిమాని కోటి భరద్వాజ రక్త దానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు.మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ వారి భద్రాచలం నందు రక్త దాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.స్వాతహగా మహేష్ బాబు వీరాభిమానైన కోటి భరద్వాజ చర్ల నుంచి భద్రాచలం వెళ్లి రక్త దానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు.ఈ సందర్భంగా కోటి భరద్వాజ మాట్లాడుతూ ఇప్పటి వరకు పది సార్లు రక్త దానం చేయడం జరిగిందన్నారు. అభిమాన హీరోల పుట్టిన రోజులకు పెద్ద పెద్ద ప్లెక్సీలు కట్ అవుట్లు కాకుండా సమాజ సేవకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. పది సార్లు రక్త దానం చేసిన భరద్వాజ కు ట్రస్ట్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
.
Aksharam Telugu Daily