Sunday, 07 June 2026 06:27:09 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గ్రామాల్లో సుపరిపాలన అందించాలి .. మంత్రి పొంగులేటి సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరాలి.. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఐదు మండలాలకు సాగునీరు

నూతన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన సభలో వెల్లడి..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 January 2026 05:33 PM Views : 308

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 9 (అక్షరం న్యూస్) ఇల్లెందు : అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సుపరిపాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల క్రీడా ప్రాంగణంలో నియోజకవర్గ పరిధిలో నూతనంగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికీ సంక్షేమం.. సర్పంచులదే బాధ్యత.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో అందించిన సుపరిపాలన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 69 శాతం విజయాన్ని అందించారని స్పష్టం చేశారు. "సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి సాయం వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. ఇందులో సర్పంచులు కీలక పాత్ర పోషించి, పథకాలను ఇంటింటికీ చేర్చాలి" అని సూచించారు. త్వరలోనే మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరూ అధైర్యపడొద్దని, మరో మూడు విడతల్లో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన.. డ్వాక్రా రుణాల మాఫీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత.. ఇల్లెందు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సాగు, తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి తెలిపారు. "సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తాం. దీని కోసం వచ్చే బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయిస్తాం" అని ప్రకటించారు. రాబోయే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో కార్యకర్తలు సత్తా చాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :