AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / నిజామాబాద్ /ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా / అర్ముర్ / ఆగష్టు 3 / అక్షరం న్యూస్ : - తెలంగాణ ఇంచార్జ్ ఏ. ఐ. సి. సి కార్యదర్శి కుమారి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రధ సారధి మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి సీతక్క ఏ. ఐ సి. సి కార్యదర్శి సంపతన్న, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ అజ్మాతుళ్ళ హుస్సేని , కాంగ్రెస్ కార్యకర్తల తో నిజామాబాద్ జిల్లా అర్ముర్ పట్టణంలో ఆదివారం రోజు జన హిత పాద యాత్ర నిర్వహించగా జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షులు మహ్మద్ అయూబ్ ఈ యాత్రకు ముందు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ అజ్మాతుళ్ళ హుస్సేని, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి శ్రమ దానం నిర్వహించి పట్టణ వీదులను శుబ్ర పరిచారు. ఈ సంధర్భంగా మహ్మద్ అయూబ్ మాట్లాడుతూ జనహిత పాదయాత్ర ముఖ్య ఉద్దేశ్యం, ప్రబుత్వ పధకాలైన ఉచిత విధ్యుత్, ఉచిత బస్సు, కల్యాణ లక్ష్మి, సన్న బియ్యం, ఉచిత గ్యాస్, రేషన్ కార్డు, పెన్షన్స్, రైతు రుణమాఫీ, ప్రజల వరకు సక్రమంగా చేరుతున్నాయా లేదా అనే విషయాలను దృవీకరిస్తూ, ప్రజలకు ఎదురవుతున్న ఇతర ఇబ్బందులను స్వయంగా పరిశీలించి, ప్రబుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నాలు చేయడమే జన హిత పాదయాత్ర ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ప్రజలకు పాలనా కు మధ్య వారధి గా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశలో ప్రయత్నాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన ఈ పాదయాత్ర కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ముఖ్యంగా మహిళలు పాదయాత్ర లో పాలుపంచుకోవడం అభినందనీయమని అన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆగ్ర నాయకులు యాత్ర లో భాగస్వామ్యులవడంతో కార్యకర్తల్లో మంచి జోష్ కనబడుతుందని తెలిపారు.
.
Aksharam Telugu Daily