Saturday, 07 November 2026 09:30:52 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అభినందనీయం 17 వ వార్డ్ కౌన్సిలర్ తోట ఫణిందర్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 07 November 2026 11:01 AM Views : 254

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 06 అక్షరం న్యూస్ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సేవలు మరువలేనివని మెరుగైన వైద్యం అందించడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానం ఉందని పెద్దపల్లి పట్టణ కౌన్సిలర్ తోట ఫణిందర్ అన్నారు శుక్రవారం రోజున స్థానిక నాయకులతో కలిసి కౌన్సిలర్ ఫణిందర్ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించడంతో పాటు, అక్కడ చికిత్స పొందుతున్న పలువురు రోగులను కలిసి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆపరేషన్లు, ప్రసవాలు, మందుల పంపిణీ, ల్యాబ్ పరీక్షలు వంటి సేవలను ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా చక్కగా అందిస్తున్నారని రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు ఏదైనా సమస్యను సూపరింటెండెంట్ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి పరిష్కరించడం అభినందనీయం అని తెలిపారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, సూపరింటెండెంట్ శ్రీధర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరియు ఆసుపత్రి సిబ్బందికి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరగడం చాలా సంతోషకరం అన్నారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పెద్దపల్లి పట్టణ 17 వ వార్డ్ కౌన్సిలర్ తోట ఫణీందర్ అన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :