AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : - అయిజ మండల/ ఆగస్టు 30/ అక్షరం న్యూస్:-అయిజ పట్టణంలో రాఖీ పౌర్ణమి వేడుకలు సందర్భంగా అత్యంత ఉత్సాహంగా,ఆప్యాయతల నడుమ సాగాయి. స్థానిక వాబనగిరి బొజ్జన్న స్వగృహంలో ఆదివారం జరిగిన వేడుకల్లో భాగంగా, అయిజ పట్టణంలోని 9వ వార్డు మాలపేట కాలనీకి చెందిన ఆడపడుచు యశస్విని వాబనగిరి బొజ్జన్నకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాబనగిరి బొజ్జన్న మాట్లాడుతూ రక్షాబంధన్ కేవలం తోడబుట్టిన వారికే పరిమితం కాదని స్పష్టం చేశారు. సమాజంలో రాఖీ కట్టే ప్రతి ఆడపడుచుకు, కట్టించుకున్న ప్రతి వ్యక్తి పెద్దన్నలా నిలవాలని, ఆమెకు అన్నివేళలా అండదండగా ఉంటూ రక్షణ కల్పించడమే ఈ పండుగ అసలైన పరమార్థమని ఆయన పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily