Sunday, 29 March 2026 03:25:19 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఏదులాపురం లక్ష్యం.. ‘నంబర్ వన్’ సంకల్పం.. కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఏదులాపురం ప్రగతికి మంత్రి పొంగులేటి గ్యారెంటీ.. అభివృద్ధిలో ‘పాలేరు’ రాష్ట్రాని

రూ. 62.77 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో తుంబూరు దయాకర్ రెడ్డి


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 22 January 2026 03:03 PM Views : 312

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 22 (అక్షరం న్యూస్) ఖమ్మం : పాలేరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు వేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ‘నంబర్ వన్’ గా తీర్చిదిద్దేందుకు మంత్రి పొంగులేటి కృషి చేస్తున్నారని ఆయన క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. *178 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ* ఖమ్మం రూరల్ మండలంలోని 105 మంది లబ్ధిదారులకు రూ. 32,63,000 విలువైన చెక్కులను, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 73 మంది లబ్ధిదారులకు రూ. 30,14,000 విలువైన చెక్కులను అందజేశారు. *అభివృద్ధి బాధ్యత మంత్రి పొంగులేటిది!* ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏదులాపురంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తే, ఆ ప్రాంతాన్ని రాష్ట్రం యావత్తు గర్వించేలా అభివృద్ధి చేసే బాధ్యతను మంత్రి పొంగులేటి స్వయంగా తీసుకుంటారని భరోసా ఇచ్చారు. *మహిళా సాధికారతకు కాంగ్రెస్ కృషి* మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్వచనం చెబుతోందని దయాకర్ రెడ్డి కొనియాడారు. బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆగకుండా, ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలను సైతం మహిళలకే అప్పగించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. కేవలం ఓటర్లుగానే కాకుండా, మహిళలను పాలకులుగా చేయాలన్న సంకల్పంతోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో చైర్మన్ సీట్లలో మెజారిటీ స్థానాలను వారికే రిజర్వ్ చేసినట్లు గుర్తుచేశారు. ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :