AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 10 వైరా (అక్షరంన్యూస్) పెన్షనర్ల ప్రయోజనాల కోసం ఆందోళన తప్పదు. ముఖ్యఅతిథిగా వైరా ఏసిపి రహిమాన్ పాల్గొని రిటైర్డ్ ఉద్యోగులకి సన్మానం ఎక్కువ విరాళం ఇచ్చిన దాతలకు అభినందనలు తెలియజేశారు. వైరా మండల తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల చెల్లింపులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నందున ఆ ప్రయోజనాల సాధన కోసం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన తప్పదని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైడిపల్లి శరత్ బాబు తెలిపారు. వైరాలోని దత్త సాయి కళ్యాణ మండపంలో వైరా డివిజన్ పెన్షనర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు డివిజన్ అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన పెన్షన్ విధానాన్ని అమలు కోసం ఆరాటపడుతుందని పెన్షనర్ల ప్రయోజనాలను ఒక్కొక్కటి అంతరించిపోతున్న సమయంలో పెన్షనర్లందరూ ఒక్క దాటిపైకి వచ్చి ఆందోళన చేయవలసిన స్థితి వచ్చినదని. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యతతో గత ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేకంగా పనిచేసినందున ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదరించిన ఆ సమస్యలను పరిష్కరించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. కౌన్సిల్ కి ముందు వైరా డివిజన్లో ఆధునికరించిన పెన్షనర్స్ భవన్ ను జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య రాష్ట్ర కార్యదర్శి పి. శరత్ బాబు ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బయ్య జిల్లా కార్యదర్శి తాళ్లూరు వేణు కలిసి భవనాన్ని ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య మాట్లాడుతూ పెన్షనర్ల సివిపి ను 11 సంవత్సరాల మూడు నెలలకు తగ్గించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్న పట్టించుకోకుండా రికవరీలను 15 సంవత్సరం వరకు చేస్తుండటం వలన పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పెన్షన్ డైరెక్టేట్ ను ఏర్పాటు చేయాలని పిఆర్సి నివేదికను వెంటనే ప్రకటించి పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బయ్య మాట్లాడుతూ పెన్షనర్లకు ఆరోగ్య కార్డుల పై నగదు రైతు వైద్యాన్ని అందించాలని అందుకు పెర్షనర్లు తమ పెన్షన్ నుండి కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి ఇవ్వటానికి సిద్ధపడిన ప్రభుత్వం తాశ్చర్యం చేస్తూ నగదు రైతు వైద్యం అందించడంలో జాప్యం చేస్తున్నారని దానివలన ఎందరో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా కార్యదర్శి తాళ్లూరు వేణు మాట్లాడుతూ స్పెషల్ టీచరుగా పనిచేసిన పెన్షనర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తానని గతంలో ప్రభుత్వం ప్రకటించిందని దాని అమలు కోసం పూనుకోవాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. అనంతరం వైరా ఏసిపి రెహమాన్ పెన్షనర్లకు సహాయపడుతూ అదేవిధంగా పెన్షన్ భవన్ ఆధునికరించడంలో ఆర్థిక తోడ్పాటు అందించిన పెన్షనర్లను ఆయన సన్మానించారు వారిలో. పైడిపల్లి సత్యనారాయణ కొల్లి దుర్గ, వీసీ సత్యనారాయణ, కే జగన్నాధ రావు, ఎస్ ఝాన్సీ అబ్బూరి రమణమ్మ తదితరులను సన్మానించారు. మరియు టీవీ కృష్ణయ్య సూరి వైరా బ్యాంక్ మేనేజర్. తదితరులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్ పెంటయ్య ,ఎం. వాసుదాసు, ఎస్.కె వలీజాన్, సిహెచ్ యస్ వి ప్రసాద్, జి సుబ్బయ్య చల్లా కృష్ణారావు ఎం జయశంకర్ సామినేని వెంకటేశ్వరరావు వై అరుణ, కే శారద, బి పంతులు జీవీ కృష్ణారావు, పి నరసింహారావు వైరా ఏటిఓ ఎల్లయ్య, బ్యాంక్ మేనేజర్ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily