AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ ఆగస్టు 1---- మండల కేంద్రంలో బీఎస్పీ మండల కార్యాలయంలో పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు కొండా చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ బి ఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజల ఓట్లు అడిగే హక్కు ఇసుమంత కూడా లేదని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆ ప్రాంతం లోనీ ఏ సమస్యల పరిష్కారం చేయలేదని అన్నారు. సమస్యల పరిష్కారం చేయకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయని విమర్శించారు. పదేళ్ల పరిపాలనలో బి ఆర్ఎస్ పార్టీకి ప్రజా సమస్యలు గుర్తుకు రాలేదని మళ్లీ ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి అధికారంలోకి వస్తే ఆ సమస్యలు పరిష్కరిస్తామని బి ఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు రేగ కాంతారావు పేరు తోటి ప్రకటన చేయడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఎన్నికలు వస్తే తప్ప బి ఆర్ఎస్ పార్టీకి ప్రజా సమస్యలు గుర్తుకు రావా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం ప్రజలను మోసం చేసే డ్రామాలు ఇకపై బి ఆర్ఎస్ నాయకత్వం బంధు చెయ్యాలని అన్నారు. చర్ల మండల ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టడం ఎవ్వరికి సాధ్యం కాదని ప్రజలు అన్ని గమనిస్తారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే కోరేగడ్డ భూములు ముంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడిందని దండుపేట నుంచి సీ కత్తి గూడెం వరకు ఉన్న రోడ్డు ధ్వంసం అయ్యిందని అన్నారు. ఫైర్ స్టేషన్ ఇవ్వలేదని డిగ్రీ కాలేజ్ ఇవ్వలేదని అంతేకాకుండా వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వంగా నిలిచిందని విమర్శించారు. చర్ల మండలం లో ఏ సమస్య పరిష్కరించకుండా సంక్షేమ పథకాల ను ఎరగా చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతూ ప్రభుత్వం వెలగబెట్టినప్పుడు కాలం వెళ్ళబుచ్చారని మళ్లీ ఓట్ల కోసం డ్రామాలాడుతున్నారని ఈ డ్రామాలను తక్షణమే బంద్ చేయాలని హెచ్చరించారు. స్థానిక ప్రాంత ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోని బి ఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బహుజనుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న బిఎస్పీకి అధికారం ఇవ్వాలని తద్వారా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ చర్ల మండలం ఉపాధ్యక్షులు గోగికార్ రామలక్ష్మణ్ మండల కార్యదర్శి సామల ప్రవీణ్ మండల ఈసీ మెంబర్ గుర్రాల విజయ్ కుమార్ మండల ఈసీ మెంబర్ కొండ కౌశిక్ మండల ఈసీ మెంబర్ పంబి మొగలపల్లి సెక్టార్ కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily