Saturday, 18 April 2026 02:17:54 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రకృతి ఇచ్చిన ఎనలేని అటవీ సంపదను ప్రతి ఒక్కరూ భాద్యతగా కాపాడుకోవాలి... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అటవీ అమర వీరులకు అడవుల

అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 11 September 2025 07:17 PM Views : 520

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 11 (అక్షరంన్యూస్) అడవుల సంరక్షణ అటవీ అమర వీరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నందు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, డి.ఎఫ్.ఓ. సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి పాల్గొన్నారు. అటవీ అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల సంస్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించి, అటవీ– వన్యప్రాణి రక్షణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. 2022లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో శ్రీనివాస్ రావు అనే అటవీ అధికారి అకాల మరణం చెందారని, వారి మరణం తనను చాలా కలిచి వేసిందని అన్నారు. కొత్తగూడెం జిల్లాలో వివిధ హోదాలలో పనిచేసే సమయంలో అటవీ పరిరక్షణ మీద అనేక సమస్యలు పరిశీలించానని అన్నారు. అడవుల సంరక్షణకు నిర్విరామంగా కృషి చేస్తున్న అటవీశాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అటవీ శాఖ సిబ్బందిని కలెక్టర్ సైలెంట్ హీరోస్ గా అభివర్ణించారు. అటవీ పరిరక్షణ కోసం వీరోచితంగా రాత్రి, పగలు అటవీశాఖ సిబ్బంది పనిచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అడవులు నరుక్కుంటూ పోతే మన మనుగడ కష్టం అవుతుందని, మానవ జీవన విధానంలో చెట్లు చాలా కీలకమని అన్నారు. ఖమ్మం జిల్లా అడవులకు, వన్య ప్రాణులకు నిలయంగా ఉందని, జిల్లాలోని వన సంపద కాపాడే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల డిజిటల్ డిటాక్స్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మన జిల్లా అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతి రెండు నెలలకు ఒకసారి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించి అటవీ శాఖకు అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందికి జోహార్లు అర్పిస్తూ అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. అటవీ అమరవీరుల త్యాగం మనందరికీ స్ఫూర్తి అని వారి ఆదర్శాన్ని అనుసరించి మనం ప్రకృతి–వన్యప్రాణులను కాపాడుకోవాలని అన్నారు. అటవీ సంరక్షణ ఒక బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యమని తెలిపారు. అనంతరం అటవీ సిబ్బందికి సంరక్షణ పరికరాలు, రెయిన్ కోర్టులు, స్టిక్ గార్డ్స్ లను కలెక్టర్ పంపిణీచేశారు. జిల్లా మ్యానటరింగ్, అటవీ రక్షణలో వినియోగించే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. సీసీ కెమెరా పనితీరు ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, అటవీ అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :