Friday, 24 July 2026 04:35:41 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గోర్ బోలి (లంబాడీ) భాషకు గౌరవం – తెలంగాణ అసెంబ్లీ చరిత్రాత్మక నిర్ణయం... జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు భూక్య భాస్కర్ నాయక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 31 March 2025 05:07 PM Views : 1440

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/మార్చి-31(అక్షరం న్యూస్) గోర్ బోలి (లంబాడీ) భాషకు గౌరవం – తెలంగాణ అసెంబ్లీ చరిత్రాత్మక నిర్ణయం...అని రాజన్న సిరిసిల్ల ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు భూక్య భాస్కర్ నాయక్ అన్నారు లంబాడీల భాష గోర్ బోలి భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముస్తాబాద్ మండల కేంద్రం లో స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వారి ఆధ్వర్యంలో గిరిజన నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు,ఈ సందర్భంగా భూక్య భాస్కర్ నాయక్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి గిరిజన, బంజారాల భాష అయిన గోర్ బోలికి రాజ్యాంగంలో చేర్చి ప్రాముఖ్య కల్పించాలని డిమాండ్ చేస్తున్న కూడా ఎవరు పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన బంజారాల పక్షాన నిలబడి భాష, సంస్కృతి ని గౌరవించి గోర్ బోలీ భాషను రాజ్యాంగ 8వ షెడ్యూల్ లో చేర్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారులంబాడి భాష పై అసెంబ్లీ తీర్మానం హర్షదాయకంఅని కొనియాడారు .గిరిజనులకు, బంజారాల గతంలో కానీ ప్రస్తుతం కానీ అండగా నిలబడి వారి అభివృద్ధి కి కృషి చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని,.తెలంగాణ శాసన సభలో బిల్లును ఆమోదించిన విధంగా పార్లమెంటు లో కూడా గోర్ బోలీ భాషను రాజ్యాంగంలో చేర్చే విధంగా బిల్లును ఆమోదించాలని, అందుకు బీజేపీ ఎంపీ లు మద్దతు తెలపాలని ఆయన అన్నారు. భారత దేశంలో 22 రాష్ట్రాలలో మాట్లాడే భాషగా ఉందని, అంతేకాకుండా రాజస్థాన్ మేవడ్ నుంచి వచ్చిన సంతతి బంజారా అని తెలియజేసారు. జిల్లా గిరిజన బంజారా పక్షాన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో ముస్తాబాద్ గిరిజన నాయకులు బాదావత్ గోవర్ధన్, లకవత్ పెద్ద మున్నా, లకవత్ చిన్న మున్నా , లకావత్ నర్సింలు,భూక్య గురుబాబు, రామావత్ చందు, బాదావత్ రమేష్, బుక్య మోహన్, మూడవత్ నవీన్,మహిళలు తదితరులు పాల్గొన్నారు ..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :