Friday, 06 March 2026 03:07:57 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రపంచానికి అంబేద్కర్‌ స్పూర్తిదాత..* *రాజ్యాంగ పరిరక్షణకోసం పోరాట మార్గాన్ని ఎంచుకోవాలి..*

*భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతి పౌరుడు ప్రతిన పూనాలి.* *సిపిఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్‌ బిఆర్‌. అంబేద్కర్ 134 జయంతి


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 14 April 2025 07:28 PM Views : 813

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : *.* భద్రాద్రి కొత్తగూడెం / పాల్వంచ / ఏప్రిల్ 14 /అక్షరం న్యూస్ - అవమానాలు పొందిన చోటే సత్కారాలు పొంది ప్రపంచానికి స్పూర్తిదాతగా, మహోన్నత నేతగా ఎగిన డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అని *సిపిఐ జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్* అన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్‌ బిఆర్‌. అంబేద్కర్‌ 134వ జయంతి వేడుకలను సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం పాల్వంచ స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభల్లో వారు మాట్లాడుతూ చిన్నతనంలో ఎదురైన కష్ట నష్టాలను ఎదుర్కొవడంతో పాటు అవమానాలను చిరునవ్వుతో దిగమింగి న ధీశాలి అంబేద్కర్‌ అని కొనియాడారు. దేశంలో నిమ్న జాతులన్నింటికీ దిశానిర్ధేశం చేసి భారత రత్నగా ఎదిగారన్నారు. రాజ్యాంగం ద్వారానే సాంఘిక అసమానతల్ని రూపుమాపాలని అంబేద్కర్‌ తెలిపారని, సోషలిజం కోసం ఆయన కలలు కన్నారన్నారు. అంబేద్కర్‌ భావజాలాన్ని విస్త్రతంగా సమాజంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని, ఆయన ఆలోచనా విధానాన్ని అడ్డుకునేందుకు మతోన్మాదులు కుట్ర పన్నుతున్నారని, ముఖ్యంగా దళితులు, స్త్రీలకు అంబేద్కర్‌ హక్కులు సాధించిపెట్టారని, ఐతే వీరికి రాజ్యాధికారం వస్తే వారి అటలు సాగవని మతోన్మాద భావజాలం కలిగిన వారు అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని, వీరి కుయుక్తులను తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కుల రహిత సమాజం కోసం కృషి చేశారని, సమాజంలో అంటరానితనం, అస్పృశ్యత మొదలగు దురాచారాలకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడారని అన్నారు. సామాజిక న్యాయం లక్ష్యంగానే డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని అది నేడు ప్రమాదంలోకి నెట్టబడుతుందని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ధ్వంసం చేయబడుతుందని, సామాజిక న్యాయమును చిన్నాభిన్నం చేసి కుల వ్యవస్థను పెంచి పోషించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని తీసుకువచ్చేదానికి పూనుకుంటున్నారని దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, ప్రజాస్వామ్యవాదులు పోరాడాలని అన్నారు. అంటరానితనం వివక్షత దోపిడీ లేని నూతన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. *ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు డీ సుధాకర్, ప్రజాసంఘాల నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు, చెరుకూరి శేఖర్, చెన్నయ్య, మడుపు ఉపేంద్ర చారి, వైఎస్ గిరి, వల్లపు యాకయ్య, బీవీ సత్యనారాయణ, బానోత్ రంజిత్, రవి, బానోత్ చందులాల్, జరుపుల మోహన్, జకీరయ్య, బాదావత్ శ్రీను, బిక్కు లాల్, ఎస్కే కరీం, ఆవుల సతీష్, ఎర్రగడ్డ ప్రభాకర్, ఆదినారాయణ, బిల్లా రంగయ్య, రాము, సత్యనారాయణ* తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :