Tuesday, 10 February 2026 07:40:52 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఘనంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం. -రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి. మంత్రి పొన్నం ప్రభాకర్.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 13 May 2025 10:00 AM Views : 658

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్/సిద్దిపేట మే 12(అక్షరం న్యూస్) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు హాజరై అమ్మవారి కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వైశాఖ పౌర్ణమి నుండి హుస్నాబాద్ ఎల్లమ్మ ఉత్సవాలు బోనాలు ప్రారంభమయ్యాయి.మళ్ళీ పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాలు లక్షలాది మంది పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.. ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఇస్తుంది.అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి.ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం అన్నారు.కాకతీయుల కాలం నాటి నుండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నుండి హుస్నాబాద్ ఎల్లమ్మ కీ చరిత్ర ఉంది.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం.హుస్నాబాద్ నియోజకవర్గం అంతా మంచిగా ఉండాలని కోరుకున్న ఎల్లమ్మ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.బోనాలు ,పట్నాలు , ఒడిబియ్యం కార్యక్రమాలు జరుపుకొని అందరూ సుభిక్షంగా ఉండాలని ఎల్లవ్వ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని వేడుకున్నానని అన్నారు. *శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి. ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.కొత్తగా ఎన్నికైన ఉత్సవ కమిటీ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు.భక్తులు అమ్మవారిని బోనాలు , ఒడిబియ్యం ,ఆలయం వద్ద మొక్కలు చెల్లించుకొని వంటలు చేసుకుంటారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఒక ఎంట్రీ క్యూలైన్ , ఒకటి ఔట్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు.అధికారులు ప్రోటోకాల్ , బారికేడ్లు,భక్తులకు తాగునీటి ఏర్పాట్లు , శానిటేషన్ , పట్టణంలో విద్యుత్ అలంకరణ ,పార్కింగ్ ,లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన దేవాలయ ఉత్సవ కమిటీనీ మూడు టీం లుగా ఏర్పాటు చేసి ఆరు గంటల చొప్పున పని విభజన చేసుకోవాలని సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య,ఆలయ ఈవో, ఆర్డీవో , ఎమ్మార్వో , మున్సిపల్ కమిషనర్, పోలీస్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :