D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 24 వైరా (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీకి త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆదేశిస్తే మున్సిపాలిటీలోని జనరల్ వార్డులలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు కాంగ్రెస్ వైరా పట్టణ నాయకులు వీరంశెట్టి సీతారాములు ఉన్నట్లు తెలుస్తుంది. వీరంశెట్టి సీతారాములు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో అవార్డు నాయకులతో కలిసి ఎన్నో కార్యక్రమాలు పాల్గొని పార్టీని ముందుకు నడిపించేందుకు అందరితో కలిసి ప్రయాణించాడు, ఆపదలో ఉన్న వారికి కూడా అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉండదని భరోసా ఇచ్చాడు, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే జనరల్ వార్డులలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని వీరం శెట్టి సీతారాములు తెలుపుతున్నాడు . ఇదే విషయమ వీరంశెట్టి సీతారాములు ను వివరణ అడగగ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి అనుగుణంగా పనిచేస్తానని ,వారు ఆదేశిస్తే జనరల్ వార్డులలో ఎక్కడ నుంచి అయినా తప్పకుండా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పోటీ చేస్తానని సీతారాములు తెలుపుతున్నారు.
.
Aksharam Telugu Daily