Wednesday, 26 August 2026 11:03:49 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, మళ్లింపుపై కఠిన చర్యలు సివిల్ సప్లైస్, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన సీపీ అంబర్ కిషోర్ ఝా

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 25 August 2026 06:09 PM Views : 120

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / గోదావరిఖని జిల్లా/ పెద్దపల్లి : * అక్షరం గోదావరిఖని ప్రతినిధి ఆగస్టు 15 రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా,అక్రమ నిల్వ, మళ్లింపును అరికట్టేందుకు పోలీస్, సివిల్ సప్లైస్ అధికారులు సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు చేపట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టే చర్యలపై రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్, సివిల్ సప్లైస్ అధికారులతో సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడం, మళ్లించడం వల్ల వారికి నష్టం కలుగుతుందని సీపీ పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించడం,నిల్వ చేయడం,ఇతర ప్రాంతాలకు తరలించడం, మళ్లించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులతోపాటు, వారి వెనుక ఉన్న నెట్‌వర్క్‌లపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అక్రమ రవాణాకు సహకరించే వ్యక్తులు, వాహనదారులు, నిర్వాహకులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు అవకాశం ఉన్న మార్గాలు, సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచడంతోపాటు, అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీపీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు,సివిల్ సప్లైస్ అధికారులు కె. శ్రీనాథ్ (డీసీఎస్‌వో), సంతోష్ సింగ్ (డీటీ, పెద్దపల్లి), ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :