Friday, 06 March 2026 03:07:56 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రోడ్డు ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత.... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

పెట్రోల్ బంక్ కు 100 మీటర్ల దూరంలో రోడ్డుపై బ్లింకర్స్, రంబుల్ ష్ట్రిప్స్ ఏర్పాటు.. రోడ్డు భద్రత ప్రమాణాలపై పెట్రోల్ బంక్ నిర్వాహకులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 January 2026 03:45 PM Views : 275

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 9 (అక్షరం న్యూస్) రోడ్డుపై ప్రమాదాల నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రత ప్రమాణాలపై శుక్రవారం పెట్రోల్ బంక్ నిర్వాహకులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు మరణించినా, వైకల్యం పొందినా ఒక కుటుంబం దెబ్బతింటుందని అన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. పెట్రోల్ బంక్ ఎంట్రీ, ఎగ్జిట్ కు కొద్ది దూరం నుంచి కర్వ్ ఉంటూ ప్రధాన రోడ్డు కలిసే విధంగా అవసరమైన మార్పులు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పెట్రోల్ బంక్ డీలర్లకు సూచించారు. నూతనంగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే సమయంలో ఎంట్రి, ఎగ్జిట్ వద్ద కర్వ్ తో కూడిన రోడ్డు ఉండేలా చూడాలని అన్నారు. పెట్రోల్ బంక్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ లకు దూరంలో ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. పేట్రోల్ బంక్ కు ఇరు వైపులా 100 మీటర్ల దూరంలో రోడ్డుపై బ్లింకర్స్, రంబుల్ ష్ట్రిప్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. పెట్రోల్ బంక్ లో పని చేసే సిబ్బంది యూనిఫాం ద్వారా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంపై ప్రచారం కల్పించాలని అన్నారు. పెట్రోల్ బంకు వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పని సరిగా ఉండాలని, పెట్రోల్ బంక్ నిర్వాహకులు, సిబ్బందికి సీపీఆర్ ట్రైయినింగ్ అందించాలని, దానికి అవసరమైన కార్యాచరణ తయారు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. పెట్రోల్ బంక్ వద్ద సెల్ ఫోన్ వాడక పోవడం, వాహన ఇంజన్ ఆఫ్ చేయడం కీలకమని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్నారు. జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్న 50 రోడ్లను గుర్తించి అక్కడ మున్సిపల్, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే, రెవెన్యూ, రవాణా శాఖ సంయుక్తంగా పరిశీలించి ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ డి. జగదీష్, డి.ఎల్.ఎం.ఓ. ప్రవీణ్ కుమార్, ఆర్ అండ్ బి డిఈ జి. రాధిక, పౌర సరఫరాల శాఖ కార్యాలయ సిబ్బంది, వివిధ పెట్రోల్ బంక్ నిర్వాహకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :