P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల పెద్దపల్లి అక్టోబర్ 03 అక్షరం న్యూస్ ఓదెల: మండలంలోని కొమిర. డి 86 కెనాల్ వెంటపరిసరాల్లో గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లను చోరీ చేయడంతో రైతుల్లో కలవరం నెలకొంది. ఇదే గ్రామానికి చెందిన మంచినీటి బావి ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకు వెళ్ళిన సంగతి మరవక ముందే ఇలాంటి సంఘటన జరగడం గ్రామంలో కలకలం రేగింది కెనాల్ వెంట పొలాలకు నీటిని అందించేందుకు ఏర్పాటు చేసుకున్న మోటార్లను రాత్రి సమయంలో చిన్న కొమిర గ్రామానికి చెందిన కాసర్ల రాజి రెడ్డి. సదువు శ్రీనివాస్ రెడ్డి . పెద్ద కొమిర .గ్రామానికి చెందిన కేశిరెడ్డి లక్ష్మారెడ్డి లకు చెందిన మూడు మోటార్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు రైతులు తెలిపారు. ఉదయం పూట పొలానికి నీరు పెట్టేందుకు వచ్చిన రైతులకు ఓటర్లు కనిపించకపోవడంతో కొంత ఆవేదన చెందారు మోటార్లు చోరీ కావడంతో పంటలకు సాగునీరు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి చోరీలు చోటుచేసుకున్నాయని, కెనాల్ పరిసరాల్లో రాత్రివేళ నిఘా లేకపోవడంతో దుండగులు రెచ్చిపోతున్నారని వారు పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్ల చోరీపై పోలీసులు దృష్టి సారించి, దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కెనాల్ పరిసరాల్లో రాత్రివేళ పోలీసుల గస్తీ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily