D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 11 తల్లాడ (అక్షరంన్యూస్) తల్లాడ స్థానిక సిపిఎం ఆఫీసులో పార్టీ మండల కమిటీ సమావేశం మన్నేపల్లి రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం మట్టి మనుషులు జరిపిన చారిత్రక పోరాటంలో 4000 మంది మరణించారని అట్టి పోరాటాన్ని నేడు కేంద్రంలో అదికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం బిజెపి పార్టీ ఆ పోరాటాన్ని మతకోణంలో హిందూ ముస్లిం పోరాటంగా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తుందని నైజాముకు వ్యతిరేకంగా ముద్దుం మొహినిద్దీన్ షేక్ బందగి సోయబుల్లాఖాన్ లాంటి ముస్లింలు వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడారని నాటి పోరాటంలో స్థానిక జమీందారులైన రెడ్లు వెలమలతో పోరాడిన తెలంగాణ తొలి అమరుడు కొమరం భీమ్ అని అన్నారు. విసునూరు రామచంద్రారెడ్డి లాంటి జమీందారులతో భీమ్ రెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం చిట్యాల (చాకలి) ఐలమ్మ లాంటివారు కమ్యూనిస్టు పార్టీ తరపున అనేకమంది పోరాడి జెళ్ళ శిక్ష అనుభవించారని నాటి పోరాటాన్ని నెహ్రూ సైన్యాలు అణచివేసి అనేకమంది కమ్యూనిస్టు నాయకులను జైల్లో పెట్టించిందని చిత్రహింసలకు గురిచేసిందని అన్నారు. నైజాముకు రాజప్రముక్ బిరుదునిచ్చి సత్కరించిందని తమ్మినేని సుబ్బయ్య బోడెపుడి వెంకటేశ్వరరావు లాంటి ఉద్దండలను జైల్లో పెట్టించిందని అన్నారు. సెప్టెంబర్ 17న ఆనాటి పోరాటంలో ఏమాత్రం సంబంధంలేని రాజకీయ పార్టీలు రకరకాల పేర్లతో చరిత్ర ను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. ఈనెల 17న భక్త రామదాసు కళాక్షేత్రం ఖమ్మంలో జరిగే సాయుధ పోరాట వారోత్సవ సభకు సిపిఎం అఖిలభారత కార్యదర్శి కామ్రేడ్ ఎంఏ బేబీ హాజరవుతున్నారని ఈ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని యూరియా కొరతను తీర్చి రైతుల పంటలను కాపాడాలని ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతుంటే ప్రభుత్వాల ప్రణాళిక లేని కారణంగా వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించటం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర దేశీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టే కుట్ర జరుగుతుందని భూమికి రైతులకు దూరం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యూరియాను రైతులకు అందించటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ప్రతిపక్షాలను కలుపుకొని పోరాటం చేయటంలో లోపం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్ డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రావు నల్లమోతు మోహన్ రావు పులి కృష్ణయ్య కళ్యాణ కృష్ణయ్య సేలం పకీరమ్మ సత్తనపల్లి నరేష్ ఆదోని జీవరత్నం షేక్ నన్నేసాహెబ్ షేక్ మస్తాన్ ఐలూరి రామిరెడ్డి కట్టా దరగయ్య పేరసాని వెంకటయ్య కర్లకంఠ శ్రీనివాస్ రావు మేడి బిక్షం చావా సతీష్ అనుమోలు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily