Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *.. *ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్/ మార్చి తల్లాడ 13 (అక్షరంన్యూస్)* తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, కోనో కార్పస్ మొక్కలతో హాని జరుగుతుందని వాటిని తొలగిస్తామని ఈవో సుమారు సంవత్సరం క్రితం స్టేట్మెంట్ ఇచ్చి ఇంతవరకు తొలగించలేదు, డివైడర్లపై సూచిక బోర్డులు, ఏర్పాటు చేశారు. కానీ అవి ధ్వంసం అయ్యాయి. వాటిని పునరుద్ధరించలేదు, గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న వృక్షాలను అభివృద్ధి పేరుతో నరికి వేయడం పర్యావరణానికి ముప్పు కలిగించడం, పర్యావరణానికి హాని కలిగించారు, డంపింగ్ యార్డ్ కు తరలించాల్సిన చెత్తాచెదారాలను డంపింగ్ యార్డ్ కి తరలించకుండా చెరువుల్లో డంపు చేసి చేతులు దులుపుకుంటున్నారు, చెత్తాచెదారాలను బయటకు తరలించకుండా గృహ సముదాయాల మధ్యలోనే దగ్ధం చేస్తున్నారు, డ్రైనేజీలలో మురిగినీరు చేరి పందులు బోర్లతో దోమలు అభివృద్ధి చెందుతూ, ప్రజల రోగాల పాలవుతున్నారు, ఇవి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, అని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామపంచాయతీ పరిపాలన పరిపాలన సక్రమంగా చేయాలని వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ లోనే వేయాలని, వృక్షాలను నరికి పర్యావరణాన్ని దెబ్బతీసిన కార్యదర్శి పై తగిన చర్య తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily