Monday, 15 December 2025 08:13:48 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సీనియర్ అడ్వకేట్ సారంగం హఠాన్మరణం


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 24 August 2025 04:56 PM Views : 555

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : ** కరీంనగర్/జమ్మికుంట/ఆగస్టు 24/అక్షరం న్యూస్: ప్రముఖ న్యాయవాది శేషాల సారంగం (66) ఆదివారం రోజున ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. సారంగం మృతి తీరనిలోటు ఆయన అనేక కోర్టులలో ప్రభావవంతమైన సేవలు అందించాడు. ఏడు సంవత్సరాలుగా మంచానికే పరిమితమైనప్పటికీ న్యాయవాద వృత్తిని నిరాఘటంగా కొనసాగించాడు. జమ్మికుంట ఆదర్శ కాలేజీ విద్యార్థిగా ప్రస్థానం ప్రారంభించిన సారంగం విద్యార్థి సంఘం ఎన్నికలలో అధ్యక్షునిగా గెలుపొందారు. అటు చదువు, ఇటు ఆటలు, వ్యాస,వకృత, పోటీలలో అసమాన ప్రతిభ పాటవాలను చూపి ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందారు. విద్యార్థిగా ఉన్నప్పుడే తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వచ్చిన పదిమంది దొంగలను చావబాదిన అంశం అప్పట్లో సంచలనం సృష్టించింది. సారంగం ధైర్య సాహసాలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు నేరుగా జైలర్ గా ఉద్యోగాన్ని ఇచ్చింది. జైలర్ గా కొన్ని సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించిన ఆయన ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అదే సమయంలో న్యాయవిద్యనభ్యసించి నేరుగా ప్రాక్టీస్ లోకి వచ్చి అనేక కేసులలో విజయం సాధించారు.ఇంగ్లీషు భాషలో సారంగం అనర్గళంగా వాదించే విధానాన్ని చూసి అనేకమంది న్యాయమూర్తులు ప్రశంసించేవారు. చిన్న ప్రమాదంలో స్పైనల్ కార్డ్ దెబ్బతిని ఏడు సంవత్సరాల నుండి మంచానికే పరిమితమై ఉండి కూడా న్యాయవిద్యలో వచ్చే నవీన పోకడలను అధ్యయనం చేసేవారు. ఆయన సలహాలు, సూచనలు, డ్రాప్టింగ్ కోసం తెలంగాణ నలుమూలల నుంచి సీనియర్ న్యాయవాదులు వచ్చేవారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :