P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి అక్టోబర్ 02 (అక్షరం న్యూస్) ఓదెల ప్రెస్ క్లబ్లో గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుదర్శన్ ముదిరాజ్ మాట్లాడుతూ అహింసే ఆయుధం.. అందరికి ఆదర్శం మహాత్ముని జీవితం : జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, సహనం, అహింసా మార్గాలు ప్రతిఒక్కరూ అనుసరించాలని అన్నారు. అహింసే ఆయుధం.. అందరికి ఆదర్శం మహాత్ముని జీవితమని వెల్లడించారు. అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని, ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. దేశ పౌరులు,గాంధేయ మార్గంలో నడుచుకోవాలని, గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మారం తిరుపతిరెడ్డి సలహాదారుడు ఇరుకుల వీరేశం రవీంద్ర చారి తో పాటు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily