Monday, 16 February 2026 04:34:18 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు* *బీఆర్ఎస్ కు ఓటు వేయాలా?* *పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వలేదు* *ప్రతి

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 08 February 2026 07:01 PM Views : 331

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 8 వైరా (అక్షరం న్యూస్) ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు.. వారికి ఎందుకు ఓటు వేయాలని పట్టణ ప్రజలంతా ప్రశ్నించండి, ఆలోచించండని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు వారికి ఓటు వేయాలా? మనందరినీ తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ముంచినందుకు వారికి ఓటు వేయాలా అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. ఇక చాలు వారి పరిపాలన ముగిసిపోయింది అన్నారు. టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక ఇల్లు కానీ ఒక ఇంటి స్థలం కానీ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల క్రితం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించాయి తిరిగి ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని.. ఈ విషయాన్ని పేదల ఇంటికి సంబంధించిన ఏ ఇటుక పెళ్ళని అడిగినా చెబుతుందని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్ర వనరులు, ఆస్తులు, వ్యవస్థలు, ప్రజల కోసం ఖర్చు పెడతామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి పోయింది అన్నారు. పేదలు బడుగుల బాధలు అర్థం చేసుకునే కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి వచ్చాకే పేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఖర్చు చేస్తున్నావ్ రాష్ట్రంలో మొదటి దశలో నాలుగున్నర లక్షల నిర్మాణం జరుగుతుంది ఇందుకుగాను 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం వారు ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించేలా చేస్తామన్నారు. టిఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం పాలనలో పేదలు రేషన్ కార్డు కోసం తిరిగి తిరిగి అలిసిపోయారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులను మంజూరు చేశాము రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉండగా 1.02 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం అన్నారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన దొడ్డు బియ్యం తినలేక కోళ్ళ దానాకు ఉపయోగించేవారు కానీ నేడు కిలో 50 రూపాయల ఖరీదు చేసే సన్నబియ్యాన్ని మనిషికి ఆరు కిలోల చొప్పున ప్రజా ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు. వృద్ధులు కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే ఆస్తులు పుస్తెలు తాకట్టు పెట్టుకునే పరిస్థితి ఇబ్బంది నుంచి పేదలను బయటపడేసేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, పేదల సంక్షేమం కోసం ఎంతటి ఖర్చుకైనా ప్రజా ప్రభుత్వం వెనుకాడ బోధని తెలిపారు. మహిళలను మహాలక్ష్మి గా చూసుకునే సంప్రదాయం మనది వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామని ప్రకటించాం, మేం ప్రకటించగానే ఇది సాధ్యమా అని కొందరు ఎద్దేవా చేశారు మరి కొందరు హేళనగా నవ్వారు కానీ మేం ఇచ్చిన మాటను నెరవేర్చడమే కాదు అంతకుమించి మొదటి సంవత్సరంలో స్వయం సహాయ సంఘాల మహిళలకు 27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి పైసా పోగేస్తాం పేదలకు పంచుతామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మహిళలు రాష్ట్రంలోని ఒక మూల నుంచి మరో మూలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించాం మహిళల పక్షాన ప్రతినెల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తుందని తెలిపారు. డబ్బులు మిగిలితే ఇంట్లో ఇల్లాలు పిల్లల అభివృద్ధి కోసం ఖర్చు పెడతారు అన్న ఆలోచనతో 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం విద్యుత్ సంస్థలకు ప్రతినెల పేదల పక్షాన ప్రభుత్వమే చెల్లిస్తుంది అని తెలిపారు. పది సంవత్సరాలు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయారు, పిల్లలు చదువుకునే ఉద్యోగాల్లో స్థిరపడతారని పేద తల్లిదండ్రులు కూలి నాలి చేసి డబ్బులు పంపితే మీరు పది సంవత్సరాలు పరీక్షలు నిర్వహించలేకపోయారు అని డిప్యూటీ సీఎం ఎద్దేవా చేశారు. కానీ ప్రజా ప్రభుత్వం రాగానే గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించడమే కాదు ప్రజల సమక్షంలో ఉద్యోగ పత్రాలు అందజేశామని, అదేవిధంగా గ్రూప్ టు త్రీ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు రెండు సంవత్సరాల కాలంలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వాన్ని తెలిపారు. *వైరా వాసిగా, డిప్యూటీ సీఎం గా* *పట్టణ అభివృద్ధి బాధిత తీసుకుంటా* *ఈ ఎన్నికలు వైరా పట్టణ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు* *వైరా పట్టణ ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారో చూస్తాం* *వైరా పట్టణంలో జరిగిన ప్రతి అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే* *యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఓ వరం* *అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, చిరు వ్యాపారులకు షాపింగ్ కాంప్లెక్స్* *మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు* వైరా ప్రాంతవాసిగా డిప్యూటీ సీఎం గా తాను వైరా పట్టణ అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని, వైరా పట్టణ అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటారో చూస్తామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించాలని డివిడి సీఎం కోరారు. రోడ్లు డ్రైనేజీలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకొని భవిష్యత్తు తరాలకు ఒక మోడల్ వైరా పట్టణాన్ని అందిద్దామని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ఈ మున్సిపల్ ఎన్నికలు వైరా పట్టణ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి చేసుకుందామా? లేదా? గత పది సంవత్సరాల మాదిరిగానే పట్టణాన్ని వదిలేద్దామా అనేది ఓటర్లు ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం కోరారు. వైరా పట్టణంలో జరిగిన ఏ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన, ప్రారంభం అన్ని కాంగ్రెస్ హయాంలో జరిగినవి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన వారు చేసిన కొత్త పని ఒకటి లేదన్నారు. శాంతి కాలనీ ఎస్సీ ఎస్టీ కాలనీ అన్ని కాంగ్రెస్ హయాంలో ఏర్పడినవే అన్నారు. కరెంటు, ఆసుపత్రి, కాలేజీ, డిగ్రీ కళాశాల అన్ని కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ వైరా పట్టణానికి ఓ వరం అన్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని, విద్యా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు జూనియర్ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించారు అని తెలిపారు. ఐటిఐ ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా మార్చం పాలిటెక్నిక్ కళాశాలలో మంజూరు చేశామని తెలిపారు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే షాపులను కూలగొట్టి ఐదు సంవత్సరాలు అయ్యింది మొండి గోడలతో వైరా పట్టణం కలతప్పింది అని స్థానికులు వివరిస్తే నిన్నటికి నిన్న ఇక్కడే ఫైల్ తెప్పించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సాంక్షన్ చేయించినట్టు వివరించారు. వైరాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఫైల్ వడివడిగా ప్రాసెస్ జరుగుతుంది అని తెలిపారు. ఇక్కడి ప్రజలంతా వ్యవసాయంపై ఆధారపడిన వారే వైరా ప్రాజెక్టును అభివృద్ధి చేసుకోవాలని కుడి ఎడమ కాలువలకు లైనింగ్ చేశాం తిరిగి ప్రజా ప్రభుత్వం వచ్చాకే రెండవ దశ లైనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది ఇందుకోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని తెలిపారు. గతంలో గ్రామపంచాయతీ బిల్డింగ్ చెరువు ఒడ్డున ఉండేది కానీ దాని ప్రధాన రహదారి మీదకు తీసుకొచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును కట్టించిన ఘనత నాటి కాంగ్రెస్ సర్పంచ్ దుర్గాప్రసాద్ అని తెలిపారు. ఆధునిక వసతులతో స్మశాన వాటిక, ముస్లిం మైనార్టీ సోదరులకు బడ్జెట్ పెంచాం ఇదిగా నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతూ రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూవ్వాళ్ళ దుర్గాప్రసాద్, బొర్రా రాజశేఖర్, సూతకని జైపాల్, కట్ల రంగారావు, శీలం నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :