AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 15/ అక్షరం న్యూస్/------ యువత డబ్బులు సంపాదించామా కార్లు బంగ్లాలు కొనుక్కున్నామా అంటూ పరుగులు తీస్తున్నారు. కానీ ఈ యువ న్యాయవాది మాత్రం ప్రజాసేవ చేస్తూ నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తున్నాడు. అతనే కాకుండా తన తోటి న్యాయవాదులను కూడా ప్రజాసేవలో పాలు పంచుకునేలా ముందుకు తీసుకెళ్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తేగడ గ్రామానికి చెందిన దివ్యాంగుడు మద్ది మనోజ్ కుమార్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కలిగించాలని స్థానిక స్వచ్ఛంద సంస్థ ఐశ్వర్య మహిళా శక్తి అసోసియేషన్ తోడ్పటుతో ఆ దివ్యాంగుడి కుటుంబానికి శాశ్వత పరిష్కారానికై కిరాణా దుకాణం మరియు వస్త్ర వ్యాపారం చేసుకునేందుకు ఆర్థిక సాయం అందించి మంచి మనసును చాటుకున్నాడు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి పి వి రమణ మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే ప్రజా సేవ చేస్తున్న యువ న్యాయవాది పరిటాల సంతోష్ కుమార్ సేవలు అభినందనీయం మని ఆయన అన్నారు. నిరుపేద కుటుంబాలకు సేవ చేయాలని దృక్పథం అతి పిన్న వయసులోనే రావడం చాలా గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. పరిటాల సంతోష్ కుమార్ చేసిన ఆర్థిక స్వావలంబన కు పలువురు అభినందనలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో తేగడ గ్రామ పంచాయతీ కార్యదర్శి హాసిని మాజీ సర్పంచ్ అలవాల పార్వతి బోర పెద్దిరెడ్డి ఐశ్వర్య మహిళా శక్తి సభ్యులు గ్రామస్తులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily