D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మే20(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని అనుమతులు లేకుండా తరలిస్తున్న తునికాకు డిసిఎం ను అటవీ శాఖ అధికారులు సోమవారం రాత్రి సీజ్ చేశారు వివరాలు ఇలా ఉన్నాయి పూనుగొండ్ల యూనిట్ తునికాకును కాంట్రాక్టర్ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసిన కల్లాల నుంచి డిసిఎంలో లోడ్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించేందుకు యత్నించాడు కొందరు వ్యక్తులు డీఎఫ్ఓ కు సమాచారం ఇచ్చారు దీంతో ఎఫ్ డీఓ కు చంద్రశేఖర్ రంగలోకి దిగి డిసిఎం ను సీజ్ చేసి రేంజ్ కార్యాలయానికి తరలించారు ఆకు విలువ సుమారు రెండు లక్షలు ఉంటుందని ఎఫ్ డీఓ తెలిపారు
.
Aksharam Telugu Daily