D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : . ఖమ్మం/ వైరా టౌన్ నవంబర్ 16 (అక్షరం న్యూస్) అభివృద్ధి పదంలో వైరా మున్సిపాలిటీ అన్ని రంగాల్లో దూసుకుపోతుందని వైరా మున్సిపాలిటీ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ అన్నారు. సోమవారం వైరా మున్సిపాలిటీ, 20వ వార్డ్ లో కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ నిధులు 10 లక్షలతో సూతకాని దేవసహాయం ఇంటి పక్కన రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం కాపా చంద్రకళ మురళీకృష్ణ మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ప్రతో ఇంటికి వాటర్ ,ప్రతి రోడ్ సీసీ నిర్మాణం ,అలాగే మౌలిక వసతుల కల్పనలో ఎటువంటి జాప్యం లేకుండా జరిగేలా చూస్తామన్నారు. ఎమ్మెల్యే నిధులతో వైరా మున్సిపాలిటీ అభివృద్ధి పధంలో నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా టౌన్ ప్రెసిడెంట్ వీరంశెట్టి సీతారాములు, సీనియర్ నాయకులు పొదిల్ల హరినాధ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, మున్సిపల్ ఏఈ మాన్య, 7వ వార్డ్ కౌన్సిలర్ ఫణితి సైదులు, వేముల రత్నాకర్, సుతకాని ప్రేమ్ చంద్,రాంగోపాల్,మాజీ సర్పంచ్ పారుపల్లి కృష్ణారావు, రవితేజ, రవి, హనుమంతురావు, వార్డ్ కాంగ్రెస్ నాయకులు పువ్వాళ్ళ రాము,హుసేన్, బిక్యా, రహీం (పండు), తేజావత్ నాగేశ్వరావు, కృష్ణబాబు, నవీన్ , పృథ్వి, వెంకటేశ్వర్లు, సుమన్, నాగేశ్వరరావు, కృష్ణ, క్రీస్తుమని, రాణి, గారపాటి అశోక్, కాంతారావు, ఆశీర్వాదం, జంపన్న, మంగయ్య, మోషే, సుతకాని అశోక్, లక్కీ, విజయమ్మ, కుమారి, సుజాత, రాణి, జార్జ్ పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily