Wednesday, 13 May 2026 04:18:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

చివరి ఆయకట్టు వరకు నీరందిస్తున్నాం.. ఎల్లమ్మ కాలువను పరిరక్షిస్తాం.. సాగునీటి విషయంలో రాజీ పడేది లేదు..

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రభుత్వ విప్,


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 12 May 2026 12:24 PM Views : 105

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : సుల్తానాబాద్ /పెద్దపల్లి మే12 (అక్షరం న్యూస్) సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని పెద్ద చెరువు ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడం కోసం మంగళవారం బొంతకుంటపల్లి మరియు గర్రెపల్లి గ్రామాల మధ్యలో ఉన్న ఎల్లమ్మ కాల్వ కూడిపోయి కబ్జాకి గురికావడంతో అధికారులు మరియు స్థానిక నాయకులతో కలిసి కాలువను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి కబ్జాకి గురైన కాలువను సర్వే చేసి పూడిక తీసి 5 గ్రామాల రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, విజయరమణ రావు గారు మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తున్నామని రైతులకు అవసరమైన సాగునీటి విషయంలో ఎలాంటి రాజీ పడేది ఉండదని తెలిపారు. రైతులకు సాగునీటి సరఫరా చేసే కాలువలను ఎవరైనా అన్యాక్రాంతం చేస్తే ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి కాలువలను ఎల్లవేళలా పరిరక్షిస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని గుర్తు చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి సందేహాలు లేవని నిండు ఎండా కాలంలో కూడా నియోజకవర్గ రైతన్నలకు అవసరానికి మించి సాగునీరందించామని తెలిపారు. గతంలో అధికారంలో లేనప్పటి నుండి రైతుల కోసం కోట్లాడిన నైజం తనదని గతంలో తాను శాసనసభ్యులుగా లేనప్పుడు గత పాలకులు రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులకు గురిచేస్తే నిరసనగా ఎస్సారెస్పీ గేట్లను బద్దలు కొట్టి రైతులకు వెన్నుదన్నుగా ఉన్న నెపంలో తన మీద అప్పటి పాలకులు కేసులు పెట్టిస్తే నిన్న సోమవారం రోజున కోర్టుకు కూడా హాజరు అవడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కార్ మరియు తాను ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు పలు గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :