Monday, 15 December 2025 07:21:57 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వరదకు కొట్టుకపోయిన డైవర్షన్ రోడ్

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 26 July 2025 06:38 PM Views : 481

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా గంగారం జూలై 26 (అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని కోమట్లగూడెం కాటినాగారం గ్రామాల మధ్యలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాళలేక, వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ డైవర్షన్ దెబ్బతినడంతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులకు అత్యవసర సేవలు అన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం అప్రమత్తమై వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల పై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు బ్రిడ్జి పనుల కోసం ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు వరుసగా కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్నది. ప్రవాహం తీవ్రంగా ఉన్నందున, డైవర్షన్ రిపేర్ పూర్తయ్యే వరకు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గంగారం ఎస్సై రవికుమార్ ఎంపీడీవో మున్వర్ బేగ్ తెలిపారు. ప్రజల భద్రత దృష్టిలో పెట్టుకుని అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించారు. తాత్కాలిక మరమ్మతులు పూర్తయ్యే వరకు సహకరించాలని మండల అధికారులు విజ్ఞప్తి చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :