Monday, 15 December 2025 07:37:51 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మతోన్మాద శక్తుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం... రాజ్యాంగ పరిరక్షణకోసం ప్రతిన బూనుదాం .. బడుగుల ఆశాజ్యోతి..మానవ హక్కుల దిక్చూచి అంబెద్కర్ ...

సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 134వ జయంతి జయంతి వేడుకల్లో పాల్గొని ఘననివాళులర్పించిన కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 14 April 2025 06:06 PM Views : 689

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : . భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / ఏప్రిల్ 14/ అక్షరం న్యూస్ - : దేశాన్ని పాలిస్తున్న మతోన్మాద శక్తులతో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, ఈ శక్తుల నుంచి రాజ్యాంగాన్ని, దేశాన్ని పరిరక్షుచుకునే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. నవభారత రాజ్యంగా నిర్మాత, భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబెద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం సిపిఐ జిల్లా కార్యాలయం, పోస్టాఫీసు సెంటర్, బాబు క్యాంపు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తదితర ప్రాంతాల్లో అంబెడ్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఏర్పాటైన సభల్లో కూనంనేని మాట్లాడారు. రాజ్యాంగం ద్వారానే సాంఘిక అసమానతల్ని రూపుమాపాలని అంబేద్కర్ తెలిపాడని, సోషలిజం కోసం ఆయన కలలు కన్నారన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు, మానవ హక్కులకు అంబెద్కర్ దిక్చూచి అని, ఆయన ఆలోచనా విధానాన్ని అడ్డుకునేందుకు మతోన్మాదులు కుట్ర పన్నుతున్నారని, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, స్త్రీలకు అంబేద్కర్ హక్కులు సాధించిపెట్టారని, ఐతే వీరికి రాజ్యాధికారం వస్తే వారి అటలు సాగవని మతోన్మాద భావజాలం కలిగిన వారు అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బావితరాలకు మార్గదర్శకుడైన అంబేద్కర్ ఆశయాల సాధనకోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని, ఆయన ఆశయాలకు అనుగుణగా కుల వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, జి వీరస్వామి, వాసిరెడ్డి మురళి, వట్టికొండ మల్లికార్జున్ రావు, భూక్య దస్రు, జక్కుల రాములు, భూక్య శ్రీనివాస్, ఎస్ కె ఫహీమ్, ధనలక్ష్మి, కె రత్నకుమారి, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, కిష్టాఫర్, బత్తుల సురేష్, నేరెళ్ల రమేష్, ధర్మరాజు, యూసుఫ్, బోయిన విజయ్ కుమార్, పి సత్యనారాయణాచారి, దుర్గ, బండి నర్సింహా, నూనావత్ గోవిందు, జె గట్టయ్య, మూడు గణేష్, షాహీన్, విజయలక్ష్మి, షమీమ్, ధనలక్ష్మి, మేదిని లక్ష్మి, లక్ష్మీనారాయణ, మాతంగి లింగయ్య, పి ప్రశాంత్, కృష్ణయ్య, జహీర్, దాట్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :