P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి సెప్టెంబర్ 05 (అక్షరం న్యూస్) నల్ల మనోహర్ రెడ్డి బిజెపి పార్టీలో చేరడంతో ఓదెల మండలంలో పార్టీ జోరు అందుకుందా! బిజెపి పార్టీ అధ్యక్షులు రామచంద్ర రావు జిల్లా పర్యటన సందర్భంగా బిజెపిలో చేరిన మాజీ ఎంపీపీ పూనారపు రేణుక బిజెపిలో వర్గ బేధాలు ఉన్న వాటన్నిటిని లెక్కచేయకుండా బిజెపి నాయకులు నల్ల మనోహర్ రెడ్డి లేటుగా వచ్చిన లేటెస్ట్ గా నలుగురు బిఆర్ఎస్ కు చెందిన మాజీ సర్పంచుల ను పార్టీలో చేర్పించడం చర్చనీయాంశం అయింది అందులో నల్ల మనోహర్ రెడ్డి ప్రోత్బలంతో జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని గతంలో మాజీ ఎంపీపీ ఇప్పుడు మాజీ సర్పంచులు చేరడం విశేషం పార్టీలో చేరిన గుంపుల గ్రామా మాజీ సర్పంచ్ తిప్పారపు చిరంజీవి ఇందుర్తి గ్రామా మాజీ సర్పంచ్ అంబాల సంధ్యారాణి శ్రీనివాస్ లంబడి తండా గ్రామా మాజీ సర్పంచ్ . గుగులోతు లక్ష్మీ వస్త్రం నాయక్ ఉప్పరపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పల్లె ఓదెలు కొలనూరు గ్రామానికి చెందిన మాటూరి వెంకటస్వామి బుధవారం రాత్రి కరీంనగర్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాజీ సర్పంచ్లకు బిజెపి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎంపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా బిజెపి వైపుకు చూస్తా ఉన్నారని రెండు ప్రభుత్వాలు వైఫల్యాలకు విస్కు చెంది మాయమాటలకు మోసపోయి ప్రజలంతా బిజెపి వైపు చూస్తా ఉన్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలంలో పార్టీ జెండా ఎగరాలని బిజెపికి మంచి ఆదరణ లభిస్తుందని అదేవిధంగా త్వరలో బిజెపికి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు చేరే అవకాశం ఉన్నదని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని కార్యకర్తలు నాయకులు కష్టపడి పని చేస్తే ఫలితం దక్కుతుందని రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రతి మండల కేంద్రంలో బిజెపి పార్టీ జెండా రెపరెపలాడాలని ఆదేశించారు అనంతరం పార్టీలో చేరిన మాజీ సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఆలోచనతో పార్టీలకు చేరినందుకు ధన్యవాదాలు అన్నారు
.
Aksharam Telugu Daily