AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ ఆగస్టు 1---- జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపు మేరకు శుక్రవారం నాడు మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షులు తోట మల్ల గోపాలరావు అధ్యక్షతన విద్రోహ దినం కార్యక్రమాని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తోటమల్ల రమణమూర్తి విచ్చేశారు. ముందుగా నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహానికి నిరసన పత్రాన్ని అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏకపక్ష రోస్టర్ విధానంలో మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాలమహానాడు సీనియర్ నాయకులు తడికల లాలయ్య రిటైర్డ్ ఉపాధ్యాయులు కొంగూరు నరసింహారావు సీనియర్ జర్నలిస్ట్ దొడ్డ ప్రభుదాస్ మాల మహానాడు గౌరవ అధ్యక్షులు మోతుకూరి ప్రభాకర్ సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జి బోళ్ల వినోద్ నియోజకవర్గ నాయకులు తోటమల్ల విజయరావు,రుంజా రాజా నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జ్ నిట్ట అబ్బులు, రుంజా సుమన్ నాయకులు కొంగూరు సత్యనారాయణ తోటమల్ల కృష్ణారావు, జెట్టి వెంకటేశ్వర్లు తోకల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily