GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/జనవరి 07/అక్షరం న్యూస్: గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు ధరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లుగా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ . లచ్చయ్య తెలిపారు. బుదవారం పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బిసి, జనరల్ కులాలకు చెందిన విద్యార్థులు గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుండి 9 వ తరగతి వరకు చేరెందుకు దరఖాస్తులు ప్రారంభమైనట్లుగా తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 21 వ దేదీలోగా అవసరమైన దృన పత్యాలతో మీ సేవ కేంద్రాలలో రూ. 100 చెల్లించి నమోదు చేసుకోనాలని సూచించారు. ఫిబ్రనరి 22న ఎంపిక చేసుకున్న పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లుగా తెలియ చేశారు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మొదటి ప్రాదాన్యత ఇచ్చిన పాఠశాలలో ప్రవేశం పొందుతారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశంను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి కోరారు.
.
Aksharam Telugu Daily