GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : - రాజన్న సిరిసిల్ల/ జిల్లా స్టాపర్/ ఆగస్టు 31 (అక్షరం న్యూస్): సిరిసిల్ల పట్టణంలో ఇటీవల కురిసిన వర్షాల వలన మున్సిపల్ అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన నల్లాల ద్వారా వచ్చే త్రాగునీరు కలుషితం అయినదని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యం కార్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్ నల్లాల ద్వారా వస్తున్న త్రాగునీరు పూర్తిగా కలుషితమైదని సిరిసిల్ల పట్టణ ప్రజలు త్రాగే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఈ రెండు మూడు రోజుల నుండి వర్షాలు అధికంగా పడడం వలన మునిసిపల్ అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఈ కలుషిత నీరు వస్తుందని అన్నారు. ఇప్పటికే విష జ్వరాలతో సిరిసిల్ల పట్టణం ప్రజలు అల్లాడుతున్నారని ఆరోపించారు. పేదవారు త్రాగే నీరు అంటే ఇంత నిర్లక్ష్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల మునిసిపల్ కు జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉన్నా కూడా ఇలాంటి కలుషిత నీరు రావడం మున్సిపల్ అధికారులకు కలెక్టర్ అంటే భయం లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని మంచి త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్ తో పాటు సహాయ కోశాధికారి కుసుమ గణేష్, కోశాధికారి చిప్ప దేవదాస్ పాల్గొన్నారు.
..
Aksharam Telugu Daily