Saturday, 07 February 2026 06:20:04 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రజల పక్షాన నిలిచే అక్షరం... ...ప్రభుత్వం – ప్రజల మధ్య వారధి: అక్షరం దినపత్రిక.. ...అక్షరం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కొత్తగూడెం ఏం ఎల్ ఏ కునంనెని

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 15 January 2026 07:23 PM Views : 201

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / , జనవరి 14 / అక్షరం న్యూస్ -: ప్రతి అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడుతున్న దినపత్రిక అక్షరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఏం ఎల్ ఏ కునంనెని సాంబశివరావు కొనియాడారు. ప్రజల సమస్యలను నిక్కచ్చిగా వెలుగులోకి తెస్తూ, వినూత్న కథనాలతో సమాజాన్ని చైతన్యపరుస్తున్న అక్షరం దినపత్రిక ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని ఆయన అన్నారు. నిత్యం వినూత్న కథనాలు ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక వార్తలతో అక్షరం దినపత్రిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుందని కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా నిలుస్తూ ప్రజాపక్షన ప్రజా స్వరాన్ని బలంగా వినిపిస్తున్న అక్షరం పాత్ర అభినందనీయమని ఏం ఎల్ ఏ పేర్కొన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి సమాజంలో మార్పుకు దోహదపడే వార్తలతో పాటు విలువైన సమాచారాన్ని అందిస్తూ తెలంగాణ రాష్ట్ర మంతట అన్ని జిల్లాలలో అక్షరం తెలుగు దిన పత్రిక తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందని తెలిపారు. ఈ సందర్భంగా అక్షరం దినపత్రిక రూపొందించిన 2026 ఆంగ్ల క్యాలెండర్‌ను బుధవారం కొత్తగూడెం ఏం ఎల్ ఏ కునంనెని సాంబశివరావు సిపిఐ కార్యాలయం శేషగిరిభవన్'లో ఆవిష్కరించారు. ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అక్షరం పత్రిక ప్రయాణం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అక్షరం దిన పత్రిక ఎడిటర్ మరియు ఛైర్మెన్ షేక్ యాకుబ్ పాషా తో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా , సిపిఐ పార్టీ కార్యాలయ ఇంచార్జ్ సుధాకర్, భద్రాద్రి జిల్లా విలేకరులు, సీనియర్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :