D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి వైరా 11 (అక్షరం న్యూస్) దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన కు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లాలో త్వరలో జరుగుతున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపాలిటీలో విజయ కేతనం ఎగర వెయ్యాలని దానికి అనుగుణంగా కార్యకర్తలు నాయకులు పనిచేసే విధంగా ప్రణాళికల సిద్ధం చేసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల ని డిసిసి అధ్యక్షుడు నూతి సత్యనారాయణ సన్మానించారు.ఈ కార్యక్రమంలో రంగా జనార్దన్ రావు, డాక్టర్ కాపా మురళీకృష్ణ ముళ్లపాటి సీతారాముల తో పాటు సత్తుపల్లి అశ్వరావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily