D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం వైరా టౌన్ అక్టోబర్ 21 (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ 13వ వార్డులోని మండల పరిషత్ కార్యాలయం దగ్గర దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయి. నవరాత్రి కార్యక్రమాల ప్రారంభం నుండి ముగింపు వరకు కమిటీ సభ్యులు ప్రతి కార్యక్రమంలో ముళ్ళపాటి దంపతులను భాగస్వామ్యం చేస్తూ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ తొలి వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు మాట్లాడుతూ అమ్మవారిని నవరాత్రులు అందరం భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో, పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందని, భక్తుల కుటుంబాలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ఈ సందర్భంగా కోరుకున్నట్లుగా తెలిపారు
.
Aksharam Telugu Daily