Sunday, 27 September 2026 05:09:52 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

టెండర్‌ గడువు ముగియడంతో షట్టర్లు సీజ్‌ భారీగా పోలీసుల మోహరింపు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 12 August 2026 09:40 AM Views : 375

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగష్టు 12 అక్షరం న్యూస్ పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరిధిలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అధికారులు కఠిన చర్యలకు దిగారు. టెండర్‌ గడువు ముగిసినప్పటికీ దుకాణాలను ఖాళీ చేయకుండా కొనసాగిస్తున్న వ్యాపారులకు పలుమార్లు నోటీసులు జారీ చేసిన అధికారులు.. ఎట్టకేలకు షాపుల షట్టర్లను సీజ్‌ చేశారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని దుకాణాల టెండర్‌ గడువు ముగిసిన నేపథ్యంలో వాటిని ఖాళీ చేయాలని అధికారులు ఇప్పటికే ఐదుసార్లు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే నోటీసులకు సంబంధిత దుకాణదారుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు బుధవారం చర్యలకు పూనుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చర్యలు చేపట్టారు షట్టర్ల సీజ్‌ ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా అధికారులు ఒక్కో దుకాణం షట్టర్‌ను సీజ్‌ చేస్తూ ముందుకు సాగారు. టెండర్‌ గడువు ముగిసిన తర్వాత కూడా దుకాణాలను ఖాళీ చేయకుండా కొనసాగించడంపై అధికారులు గతంలోనే పలుమార్లు హెచ్చరించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :